గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామనీ  ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ దూరదృష్టి కారణంగా రాబోయే రోజులలో మనమే విద్యతు/-/-ను ఇతర రాష్ట్రాలకు అమ్మే రోజులు వస్తాయన్నారు. రూ.90 వేల కోట్లతో కాళేశ్వరం నుంచి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా రైతులకు 24 గంటలు నీళ్లు అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను రూ.40 వేల కోట్ల నిధులతో ఆదర్శంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి లక్ష్యమనిపేర్కొన్నారు. అన్ని గ్రామాలలో ఉన్న చెరువులను గోదావరి జలాలతో నింపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలు మెట్ట ప్రాంతాలని త్వర లోనే
సస్యశ్యామలమవుతాయని పేర్కొన్నారు. సర్పంచులుగా యువతే పెద్ద సంఖ్యలో గెలిచారనీ, ముఖ్యమంత్రి సూచించిన ప్రకారం వార్డు సభ్యులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాలను అభివృధ్ధి చేయాలని ఆకాంక్షించారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
బాధ్యతగా సేవ చేసినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు.