గోల్కొండ కోటలో విస్తృత తనిఖీలు
గోల్కొండ : ఆషాడ మాసం బోనాలకు ముస్తాబు అవుతున్న గోల్కొండ కోటలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం బాంబ్‌స్క్వాడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.