గోల్కొండ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

 హైదరాబాద్: గోల్ఫ్ క్లబ్‌లో గోల్కొండ మాస్టర్స్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైంది. ఈ ఛాంపియన్‌షిప్‌ను డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, మంత్రి చందూలాల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చందూలాల్ పర్యాటక శాఖ నుంచి గోల్ఫ్‌క్లబ్‌కు రూ.10 లక్షలు కేటాయించారు.