గౌడలకు ఆదరణ కల్పించిన కెసిఆర్
ఆదిలాబాద్,సెప్టెంబర్27(జనంసాక్షి): హరితహారంలో భాగంగా పదిశాతం గౌడ కులస్తులకు ఉపాధి కోసం ఈత, తాటి మొక్కలను నాటామని టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
కుల వృత్తులకు పూర్వవైభవం తెచ్చింది సీఎం కేసీఆరే అని అన్నారు. బీసీల్లో అన్ని కులాలను అబివృద్ధి చేయడమే లక్ష్యంగా ఒక్కో కులాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే గౌడ కులస్తుల కోసం ప్రత్యేకంగా సొసైటీలు ఉన్న చోట ఐదేకరాల భూమిని ఇచ్చి ఈత, తాటి మొక్కలను నాటుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్‌లో గౌడ కులస్తుల కోసం వంద డబుల్‌బెడ్‌రూం ఇండ్లను
కేటాయిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో సర్వాయి పాపయ్య గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు నిధులు కేటా యిస్తానన్నారు.