గౌరవ అధ్యక్షురాలుగా తప్పుకున్న విజయమ్మ
ప్లీనరీ వేదికగా పార్టీ పదవికి రాజీనామా ప్రకటన
ఎపిలో జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారని వెల్లడి
తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం
తన రాజీనామాపై ముందే వక్రీకరణలు రావడదం దురదృష్ఠకరం
భావోద్వేగంగా మాట్లడుతూ తప్పకుంటున్నట్లు వెల్లడి
గుంటూరు,జూలై8(జనం సాక్షి): వైఎస్సార్ పార్టీగౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి విజయమ్మ తప్పుకున్నారు.
మేరకు ప్లీనరీ వేదికనుంచి ఆమె భావోద్వేగ ప్రకటనచేశారు. తనను క్షమించాలని పార్టీకార్యకర్తలను కోరారు. షర్మిలమ్మ తెలంగాణ కోడలుగా.. వైఎస్సార్ కూతురుగా.. వైఎస్‌ఆర్ టీపీ పెట్టిందని వైఎస్ విజయమ్మ అన్నారు. తన వంతుగా తెలంగాణలో ఆమె ప్రయత్నం చేస్తుందన్నారు. ఆమెకు అండగా ఉండేందుకే ఇక్కడి నుంచి తప్పుకుంటున్నానని అన్నారు. భవిష్యత్‌లో తనపై విమర్శలకు తావు లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో జరుగుతున్న వైసీపీ మూడవ ప్లీనరీ సమావేశంలో ఆమె సుదీర్ఘంగా మాట్లాడారు. వైసీపీ పార్టీ పెట్టడానికి గల కారణాలను, పడిన కష్ట, నష్టాలను ఆమె వివరించారు. ఏపీలో కొడుకు వైఎస్ జగన్, తెలంగాణలో కూతురు షర్మిల పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు రాష్టాల్ల్రో వారివారి ప్రయోజనాలకు భంగం కలుగకుండా, వక్రీకరణకు, బురద రాజకీయాలకు తావు లేకుండా ఉండేందుకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల తాను రాయని, చేయని సంతకంతో తాను రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా సోషల్ విూడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్పచ్రారాలు, వెన్నుపోట్లు కావని అన్నారు. అదేవిధంగా తన ఉనికి ఎవరికీ వివాదస్పదం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కోరారు. తన అన్నకు ఏ కష్టం, ఇబ్బంది కలగకూడదనే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందని, ఒంటరిగా పోరాడుతుందని ఆమెకు అండగా నిలిచేందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఎల్లో విూడియాలో ఏదిబడితే అది రాస్తున్నారు. ఎల్లో విూడియా అబద్దాలు రాయడం దురదృష్టకరం. ఇద్దరి పిల్లలకు తల్లినే.. తెలుగువాడి గుండెచప్పుడు వైఎస్సార్. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు అని విజయమ్మ అన్నారు. ఏపీ కంటే కూడా.. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి. ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్‌కు కచ్చితంగా స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో షర్మిలకు వేరువేరు విధానాలు ఉంటాయని విజయమ్మ అన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలు పుణికిపుచ్చుకున్న వారు జగన్, షర్మిల. తెలంగాణలో షర్మిలకు నా అవసరం ఉంది, అందుకే నేను అక్కడ షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నా. నా ఉనికి ఎవరికి వివాదస్పదం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు. విూ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్‌కు ఎప్పుడు నా మద్దతు ఉంటుందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. నన్ను క్షమించమని వైఎస్‌ఆర్ అభిమానులను కోరుతున్నాను. వైఎస్సార్ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరని వైఎస్ విజయమ్మ అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని విజయమ్మ అన్నారు. రాజశేఖరరెడ్డి అందరివాడు. విూ అందరి హృదయాల్లో వైఎస్సార్‌గారు సజీవంగా ఉన్నారని అన్నారు. నాడు అధికార శక్తులన్నీజగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. 2011లో కాంగ్రెస్ పొమ్మనలేక
పొగపెట్టింది. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉద్దండ నాయకులకే వైఎస్ జగన్ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. విూ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారు. జగన్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు. వైఎస్ జగన మాస్ లీడర్. జగన్ యువతకు రోల్‌మోడల్. విూ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని విూకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన విూ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. విూ బిడ్డల్ని జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారు. విూతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ బిడ్డగా షర్మిల వైఎస్సార్‌టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారు అని వైఎస్ విజయమ్మ అన్నారు.: వైఎస్సార్ పార్టీగౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి విజయమ్మ తప్పుకున్నారు.
మేరకు ప్లీనరీ వేదికనుంచి ఆమె భావోద్వేగ ప్రకటనచేశారు. తనను క్షమించాలని పార్టీకార్యకర్తలను కోరారు. షర్మిలమ్మ తెలంగాణ కోడలుగా.. వైఎస్సార్ కూతురుగా.. వైఎస్‌ఆర్ టీపీ పెట్టిందని వైఎస్ విజయమ్మ అన్నారు. తన వంతుగా తెలంగాణలో ఆమె ప్రయత్నం చేస్తుందన్నారు. ఆమెకు అండగా ఉండేందుకే ఇక్కడి నుంచి తప్పుకుంటున్నానని అన్నారు. భవిష్యత్‌లో తనపై విమర్శలకు తావు లేకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ప్రకటించారు. గుంటూరు జిల్లా చినకాకానిలో జరుగుతున్న వైసీపీ మూడవ ప్లీనరీ సమావేశంలో ఆమె సుదీర్ఘంగా మాట్లాడారు. వైసీపీ పార్టీ పెట్టడానికి గల కారణాలను, పడిన కష్ట, నష్టాలను ఆమె వివరించారు. ఏపీలో కొడుకు వైఎస్ జగన్, తెలంగాణలో కూతురు షర్మిల పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు రాష్టాల్ల్రో వారివారి ప్రయోజనాలకు భంగం కలుగకుండా, వక్రీకరణకు, బురద రాజకీయాలకు తావు లేకుండా ఉండేందుకు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల తాను రాయని, చేయని సంతకంతో తాను రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా సోషల్ విూడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయం అంటే వక్రీకరణలు, దుష్పచ్రారాలు, వెన్నుపోట్లు కావని అన్నారు. అదేవిధంగా తన ఉనికి ఎవరికీ వివాదస్పదం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని కోరారు. తన అన్నకు ఏ కష్టం, ఇబ్బంది కలగకూడదనే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందని, ఒంటరిగా పోరాడుతుందని ఆమెకు అండగా నిలిచేందుకు రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఎల్లో విూడియాలో ఏదిబడితే అది రాస్తున్నారు. ఎల్లో విూడియా అబద్దాలు రాయడం దురదృష్టకరం. ఇద్దరి పిల్లలకు తల్లినే.. తెలుగువాడి గుండెచప్పుడు వైఎస్సార్. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగబోయేది ఒక ఎత్తు అని విజయమ్మ అన్నారు. ఏపీ కంటే కూడా.. తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వస్తాయి. ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్‌కు కచ్చితంగా స్టాండ్ ఉంటుంది. తెలంగాణలో షర్మిలకు వేరువేరు విధానాలు ఉంటాయని విజయమ్మ అన్నారు. వైఎస్‌ఆర్ ఆశయాలు పుణికిపుచ్చుకున్న వారు జగన్, షర్మిల. తెలంగాణలో షర్మిలకు నా అవసరం ఉంది, అందుకే నేను అక్కడ షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నా. నా ఉనికి ఎవరికి వివాదస్పదం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా ఉంటారు. విూ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్‌కు ఎప్పుడు నా మద్దతు ఉంటుందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. నన్ను క్షమించమని వైఎస్‌ఆర్ అభిమానులను కోరుతున్నాను. వైఎస్సార్ లేని లోటును నాకు ఎవరూ తీర్చలేరని వైఎస్ విజయమ్మ అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రస్థానమంతా జనంతో ముడిపడి ఉందని విజయమ్మ అన్నారు. రాజశేఖరరెడ్డి అందరివాడు. విూ అందరి హృదయాల్లో వైఎస్సార్‌గారు సజీవంగా ఉన్నారని అన్నారు. నాడు అధికార శక్తులన్నీజగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. 2011లో కాంగ్రెస్ పొమ్మనలేక
పొగపెట్టింది. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఉద్దండ నాయకులకే వైఎస్ జగన్ గొంతు ఎండిపోయేలా చేశారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నాం. విూ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చాను. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, జగనన్న అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పాలనలో విప్లవాన్ని తెచ్చారు. జగన్ చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశారు. వైఎస్ జగన మాస్ లీడర్. జగన్ యువతకు రోల్‌మోడల్. విూ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి గర్వపడుతున్నా. నా బిడ్డను నడిపించుకోమని విూకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన విూ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. విూ బిడ్డల్ని జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారు. విూతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ బిడ్డగా షర్మిల వైఎస్సార్‌టీపీ పెట్టుకుంది. తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుంది. వైఎస్సార్ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా ఉండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఇక్కడ అవసరం. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకుంది. తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్ బిడ్డలే అయినా ఇద్దరు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులు. దేవుడి అండతో, ప్రజల మద్దతుతో మళ్లీ సీఎంగా జగన్ గెలుస్తారు అని వైఎస్ విజయమ్మ అన్నారు.