గౌరీ లంకేశ్‌కు భద్రతలో విఫలం

కర్నాటక తీరును తప్పు పట్టిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తనకు ప్రాణహాని ఉందని పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ ఫిర్యాదు చేసిప్పటికీ పట్టించుకోకుండా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేశారని కర్నాటక ప్రభుత్వాన్ని బిజెపి ప్రశ్నించింది. కొంతమంది నక్సల్స్‌ లొంగిపోవడానికి గౌరీ లంకేశ్‌ ఎంతగానో సహాయం చేశారు. అటువంటి వ్యక్తికి ఎందుకని భద్రత కల్పించలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. ఈ హత్యలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర ఉందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరీ హత్యకు రాజకీయ రంగు పులమొద్దని రాహుల్‌గాంధీకి కేంద్రమంత్రి సూచించారు. అయితే మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్‌కు కర్ణాటక ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతోనే మావోయిస్టులతో గౌరి చర్చలు జరిపారని, ఆమెకు ఎందుకు సెక్యురిటీ ఇవ్వలేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అడిగారు. ప్రజాస్వామ్యంలో ప్రతి హత్యను ఖండించడం కరెక్టేనని.. కేరళ, కర్ణాటక రాష్టాల్ల్రో ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ కార్యకర్తల హత్యలపై ఉదారవాదులు ఎందుకు నోరు విప్పలేదని ఆయన నిలదీశారు. సంఘ్‌ కార్యకర్తలకు మానవ హక్కులు లేవా అని ప్రశ్నించారు. రాజకీయ హత్యలపై కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. గౌరి లంకేశ్‌ హత్య కేసులో దర్యాప్తు ప్రారంభం కావడానికి ముందే.. ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తముందని రాహుల్‌ గాంధీ బహిరంగంగా ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ‘సిట్‌’ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని తాము ఎలా నమ్మగలమన్నారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలతో కర్ణాటక ముఖ్యమంత్రి ఏకీభవిస్తారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. లంకేశ్‌ హత్య కేసును ఇప్పటికే సిట్‌ విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వం తాజాగా రివార్డు ప్రకటించింది. ఆమె హత్య గురించి ఏదైనా క్లూ ఇచ్చిన వారికి రూ.10లక్షలు రివార్డు ఇస్తామని కర్ణాటక ¬ంశాఖ మంత్రి రామలింగారెడ్డి శుక్రవారం ప్రకటించారు. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందనే

విషయాన్ని తెలుసుకునేందుకు సిట్‌ బృందంతో సీఎం సిద్ధరామయ్య, రామలింగారెడ్డి సమావేశమైన అనంతరం ఈ రివార్డును ప్రకటించారు. 5న గౌరీ లంకేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత సవిూపం నుంచి తుపాకీతో కాల్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్‌ తన దర్యాప్తును ప్రారంభించింది.