గ్రానైట్ పరిశ్రమంలో ప్రమాదం
కార్మికుడి మృతి
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగర శివారు కానాపురం హవేలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గ్రానైట్ పరిశ్రమ వద్ద ప్రమాదం సంభవించి ఒక కార్మికుడు మృతి చెందాడు. గ్రానైట్ పాలిషింగ్ యంత్రానికి విద్యుత్తు సరఫరా జరగటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కూచిపూడి వెంకటేశ్వర్లు (32) మృతిచెందాడు. మరో కార్మికునికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు నేలకొండపల్లి మండలం ముజ్జిగూడెం గ్రామానికి చెందినవాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.