గ్రాఫిటీని ప్రొత్సహిస్తున్న గిలాంగ్‌ నగరం

873vq501ఆస్ర్టేలియా, మార్చి 30 : ‘గ్రాఫిటీ’ భారత దేశంలో పెద్దగా ప్రాచీన్యంలో లేకపోయినా ధనిక దేశాల్లో మాత్రం ఆదొక హాబీ. గ్రాఫిటీ కళాకారుల దెబ్బకు గోడలన్నీ రంగుల మయం అవుతున్నాయి. ఆస్ర్టేలియాలోని చాలా ప్రాంతాల్లో ఆ కళను నిషేధించాయి. కానీ గిలాంగి అనే ఒక నగరం మాత్రం గ్రాఫిటీని ప్రోత్సహిస్తోంది. సామాజిక సందేశానికి రంగులు అద్ది గోడపైకి ఎక్కిండం పెద్ద కళ. గ్రాఫిటీ ఆర్ట్‌గా పేరుపొందిన దీనికి ఆస్ర్టేలియాలో చాలా ప్రాధాన్యత ఉంది.ఇళ్లు, గోడలను పాడుచేస్తున్నారంటూ చాలా నగరాలు గ్రాఫిటీని నిషేధించాయి. విక్టోరియా రాష్ట్రంలోని గిలాంగ్‌ నగరం మాత్రం గ్రాఫిటీని ప్రోత్సహిస్తోంది. గిలాంగ్‌ నగరంలో గ్రాఫిటీ కోసం కొన్ని భవనాలు, ఖాళీ ప్రాంతాలను కేటాయించారు. నగర సంస్కృతిని ఈ కళాకారులే కాపాడుతున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ గోడ చిత్రాలు గీయడం చట్టబద్దం కావడంతో విదేశాల నుంచి సయితం కళాకారులు ఇక్కడకు వస్తున్నారు.