‘గ్రామగ్రామాన అమరులను స్మరించండి’
గోదావరిఖని, జులై 29 (జనంసాక్షి) : ఆగష్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను గ్రామగ్రామన ప్రజలు ఘనంగా నిర్వహించాలని నిషిద్ధ మావోయిస్ట్ పార్టీ ఉత్తర తెలంగాణ అధి కార ప్రతినిధి జగన్, కరీంనగర్, ఖమ్మం, వరం గల్ జిల్లాల డివిజన్ కార్యదర్శి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం వారు ‘జనంసాక్షి’ కార్యాలయానికి ఓ పత్రికాప్రకటనను పంపించారు. దేశవ్యాప్తంగా ఈ యేడాది 300 మంది విప్లవకారులను ప్రభుత్వం ఎన్‌కౌంటర్ పేరిట పొట్టనపెట్టుకుందన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాల దాడిలో 23మంది ఆదివాసి అమాయకప్రజలు అమరత్వానికి గుర య్యారన్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవ విజ యాలపై పోరాటాలను నిర్వహిస్తున్న విప్లవకా రులపై ప్రభుత్వం రెండవ గ్రీన్‌హంట్‌ను అమలు పరుస్తుందని, విప్లవకారులపై కేంద్రప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాశవిక హత్యలకు పాల్పడుతుందన్నారు. దందకారణ్యం, బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఉత్తర తెలంగాణ, మహా రాష్ట్రల్లో ధైర్యసాహాసాలతో నూతన ప్రజావ్యవస్థ ఏర్పాటుకు పోరాటం సాగిస్తున్న విప్లవకారులను బూటకపు ఎన్‌కౌంటర్ల పేరిట పాలకులు దమన నీతిని చాటిచెబుతున్నారన్నారు. గుండేటి శంకర్ పాముకాటుతో వీరమరణం పొందగా శ్రీకాంత్, సునీత, పెందూరి, భీంరావు, బిఎస్‌ఎ.సత్యనారా యణ అనారోగ్యంతో మృతిచెందగా, కిషన్‌జీ, సుంకరి, పాపారావు, చుక్కాల్ సోమాల్ తదితర 300మంది విప్లవకారులను ప్రభుత్వం హతమా ర్చిందన్నారు. పీడిత ప్రజల పక్షాన పోరాటం సాగిస్తు అమరులైన వారందరికి ప్రజలు విప్లవ జోహార్లు అర్పించాలని కోరారు. గ్రీన్‌హంట్ ఆపరే షన్ పేరిట విప్లవకారులు, ప్రజలపై సైనికదాడు లు కొనసాగిస్తున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చర్యల ను ఎండగ ట్టాలన్నారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో విద్యార్థులు, యువకులు, కార్మి కులు, మహిళలు, విద్యావంతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉత్తర తెలంగాణాలో ఈ వారో త్సవాలను విజయవంతం చేయాలని జగన్, సుధాకర్‌లు కోరారు.