గ్రామస్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 6 (జనం సాక్షి): వైద్యాధికారులు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఏడాది మండల పరిధిలోని వేపాలసింగారం, బూరుగడ్డ మాచవరం తదితర గ్రామాల్లో విష జ్వరాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయని ఈ ఏడాది ముందస్తుగా గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచి అంటువ్యాధులు, వైరల్ ఫీవర్, డెంగ్యూ జ్వరాలకు కారణమైన దోమలు నిలువ లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి మాడూరు నరసింహ చారి, తంగేళ్ల వెంకటచంద్ర, లక్ష్మీ, నరసింహ, శశికళ, శేషగిరిరావు, గోపరాజు, గోపి, రామకృష్ణ, శీను, గోపాలరావు, వెంకట్ రాజు తదితరులు పాల్గొన్నారు.