గ్రామాలకు మళ్లీ జవజీవాలు

మార్పు కనిపించేలా కార్యాచరణ
నిధులతో పాటు నిర్దుష్టలక్ష్యాలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి) : గ్రామ పంచాయతీలకు మహరద్శ పట్టనుంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో పంచాయతీల్లో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామాల్లో పంచాయితీలకు నిధులను సమకూర్చడంతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చారు. దీంతో ఇప్పుడు తాజాగా కార్యాచరణకు సిఎం కెసిఆర్‌ సిద్దం అయ్యారు. మంత్రులు, అధికారులతో విస్తృతంగా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహిం చాల్సిన పనులను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏండ్లు గడిచినా గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉన్నది. మన ఊరును మనమే బాగుచేసుకోవాలనే స్పృహరాలేదు. ఏ ఊరు ప్రజలు ఆ ఊరుకు కథానాయకులు కావాలన్న సంకల్పంతో కెసిఆర్‌ ఊరి పరిస్థితిని మార్చు కోవాలన్న పిలుపుతో ముందుకు కదలనున్నారు.  పనిచేసే గ్రామ పంచాయతీ వ్యవస్థను తయారు చేయడం కోసమే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వచ్చింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో గ్రామకార్యదర్శి నుంచి జిల్లాపరిషత్‌ సీఈవో వరకు అన్ని ఖాళీలను భర్తీచేస్తున్నారు. కావాల్సినన్ని నిధులు విడుదలచేస్తున్నారు.  అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను చట్టం స్పష్టంగా పేర్కొన్నది. విధులపట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకునే అధికారంకూడా చట్టం కల్పించింది. చాలా ముఖ్యమైన పనులను ప్రభుత్వమే తన యంత్రాంగం ద్వారా నేరుగా చేస్తున్నది. గ్రామంలో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, పన్నులు వసూలు చేయడంలాంటి బాధ్యతలు గ్రామపంచాయతీలు నెరవేర్చాల్సి ఉన్నది. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.  ఈ కార్యక్రమాలను వేడుకగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొత్త పంచాయతీల ఏర్పాటు ఓ చరిత్ర.  ప్రతీ కార్యదర్శి పరిధిలో కనీసం 5వేల జనాభాతో పాటు పంచాయతీ భవనాల ఏర్పాటు, ఉద్యోగుల, ఆస్తుల విభజన స్టేషనరీ, ఫర్నిచర్‌ తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచాయతీరాజ్‌ చట్టం-2018 లో పొందుపర్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు లేక నీరసించిన పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా అభివృద్ధి బాట పట్టాయి. అరకొర నిధులు రావడంతో ఏ గ్రామంలో చూసినా అసంపూర్తి పనులే దర్శనమిచ్చేవి.  అప్పటి
వరకు పట్టింపు లేకుండా ఉన్న పంచాయతీలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీలకు పరిపుష్టిగా నిధులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తూనే ఎంపీ ల్యాడ్స్‌, ఏసీడీ నిధులను పెద్ద మొత్తంలో గ్రామాలకు మళ్లించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాలపై దృష్టి సారించేలా చేశారు. ఫలితంగా గడచిన నాలుగేళ్లలో వందలాది గ్రామాలు ప్రగతి పథంలో నడిచాయి.
తాజాగా గ్రామాల్లో అమలుచేయాల్సిన 60 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటిదశలో 30 రోజుల ప్రణాళికను సెప్టెంబర్‌ 6 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శనం చేసేందుకు రాష్ట్రంలోని పంచాయతీరాజ్‌శాఖ అధికారులతో సెప్టెంబర్‌ 3న విస్తృతస్థాయి సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. గ్రామాల్లో అతితక్కువ వేతనాలతో పనిచేస్తున్న సఫాయీ కర్మచారుల వేతనాలను రూ.8,500కు పెంచుతున్నట్టు ప్రకటించారు. పంచాయతీరాజ్‌ శాఖలో అన్ని ఖాళీలను భర్తీచేయడంతోపాటు, కేంద్ర ఆర్థికసంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జతచేసి నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదలచేయాలని అధికారులను
ఆదేశించారు. గ్రామాల్లో అమలుచేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలువురు మంత్రులు, కలెక్టర్లు, డీపీవోలు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సవిూక్షించారు.