గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…. జిల్లా కలెక్టర్ కె.శశాంక. మహబూబాబాద్ జూన్ -13 జనం సాక్షి:

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.శశాంక తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక నర్సింహులపేట మండలం ఫకిర తండా గ్రామంలో పర్యటించి వాడలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీధుల్లో అపరిశుభ్ర వాతావరణం, బురదమయంగా ఉండడంతో గ్రామస్తులతో మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వాడకం నీటిని వీధులలో బయటికి వచ్చే విధంగా వదలడంతో రోడ్డు ప్రక్కన నిలిచి అపరిశుభ్రంగా కనబడటంతో పాటు దోమలు పెరుగుతాయని,దీంతో మనము మన పిల్లలు అనారోగ్యం బారిన పడతామని తెలిపారు.
గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ముందుగా సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లు ఎనమిది మంది ఇంకుడు గుంతలను వారం లోగా ఏర్పాటు చేసుకొని ప్రజలకు వాటి మీద అవగాహన కల్పించి వారు తమ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అంతకుముందు ఫకీర్ తండా కు సంబందించిన సెగ్రిగేషన్ షెడ్ ను,హరిత హారం నర్సరీ ని పరిశీలించారు.
సెగ్రిగేషన్ షెడ్ వాడకంలోకి తీసుకొని రావాలని,డంపింగ్ యార్డ్ కు తీసుకొచ్చిన చెత్తను కాల్చడం పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ,తడి పొడి చెత్తను వేరు చేయడం లేదని,పొడి చెత్తను అమ్మి ఆదాయం పొందాలని,తడి చెత్త తో ఎరువులను తయారు చేసి నర్సరీ, హరిత వనాలకు వాడాలని సూచించారు. సెగ్రెగేషన్ షెడ్ నిర్వహణకు గాను మల్టీ పర్పస్ వర్కర్ లకు నెలవారీ గా విధులు కేటాయించి సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ మెరుగు పరచాలని అన్నారు.  సెగ్రిగేషన్ షెడ్ కు ట్రాక్టర్ వచ్చే విధంగా రోడ్డును సరి చేయాలని,లాగ్ బుక్ నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లోని 286 ఇళ్ల నుండి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని చెత్త సేకరణ చేయాలని, వంద ఇళ్లకు ఒక ట్రై సైకిల్ తో ప్రతి రోజూ చెత్త సేకరణ,పారిశుధ్య పనులు జరిగే విధంగా చూడాలన్నారు.
హరిత నర్సరీ నీ పరిశీలిస్తూ, పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, డి.ఆర్.డి.ఓ. సన్యాసయ్య,డి.పి.ఓ. సాయిబాబా,ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, తహసిల్దార్ విజయ్ కుమార్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.