గ్రామాలను మున్సిపాలిటీలలో కలిపి గాలికి వదిలేసిన ప్రభుత్వం: టిపిసిసి అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి
శామీర్ పేట్ జనం సాక్షి :
తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్, పోతాయి పల్లి గ్రామాలలోని పలు కాలనీలు నీట మునిగి, రోడ్లన్నీ జలమయమై ఎప్పుడు వర్షాలు వచ్చినా తీవ్ర ఇబ్బందులకు కాలనీల వాసులు గురవుతున్నారు. శుక్రవారం రోజు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దేవరయాంజాల్,పోతాయి పల్లి గ్రామాలలోని పలు కాలనీలను,రహదారులను పరిశీలించారు . అనంతరం హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను విచ్చలవిడిగా ఏర్పాటు చేసి పలు గ్రామాలను ఆయా మున్సిపాలిటీలలో చేర్చి చేతులు దులుపుకుందన్నారు.
మున్సిపాలిటీలలో చేరిన కొత్త గ్రామాలకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని, వారికి విచ్చలవిడిగా పన్నులు వేసి,ముక్కు పిండి వసూలు చేస్తూ కనీసం గ్రామాల బాగోగులు పట్టించుకోని ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు.
మేడ్చల్ నియోజకవర్గ శాసన సభ్యుడైన స్థానిక మంత్రి మల్లారెడ్డి మున్సిపాలిటీలో చేరిన శివారు గ్రామాలపై కనీసం దృష్టి పెట్టకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.
ఈ మున్సిపాలిటీల చుట్టే ఆయన ఇంజనీరింగ్ కాలేజీలు,మెడికల్ కాలేజీలు ఉన్నాయి గాని,వాటి అభివృద్ధిపై పెట్టిన శ్రద్ధ కనీసం ఈ గ్రామాలపై రవ్వంత కూడా చూపడం లేదని అన్నారు.
గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడే ఈ గ్రామాలు స్వయంపాలనతో ఎంతో కొంత అభివృద్ధి చెందాయి.
మున్సిపాలిటీలలో చేర్చిన తర్వాత పన్నుల వసులపై చూపించే శ్రద్ధ గ్రామాల అభివృద్ధి పై చూపించడం లేదని,గ్రామంలోని మహాలక్ష్మి వెంచర్ కాలనీలో ఎన్నో ఏళ్లుగా వరద ముంపుతో,మురుగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైతులు ముందుకు వచ్చి వరద కాలువ నిర్మాణానికి భూములు ఇస్తామన్నా కనీసం అధికారులు దానిపై శ్రద్ధ పెట్టకుండా ప్రజలను గాలికి వదిలేయడం సిగ్గు చేటన్నారు.
పోతాయి పల్లి గ్రామంలో రహదారులన్నీ దెబ్బతిని గ్రామంలో నడవలేని పరిస్థితి ఉందని,
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రజలు ఈ బాధలు పడాల్సిందేనా?
స్థానిక మంత్రి మల్లారెడ్డి తనకు ఓట్లేసిన ప్రజలను కనీసం ఇప్పటికైనా పట్టించుకుని,ఈ కాలనీలలో, గ్రామాలలో ప్రజల బాధలను గుర్తించి,రోడ్లను,డ్రైనేజీ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలని
లేకపోతే జనాగ్రహానికి మంత్రి మల్లారెడ్డి గురికావాల్సి వస్తుందni హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,అల్వాల్ సొసైటీ మాజీ డైరెక్టర్ మొగుళ్ళ శ్రీనివాసరెడ్డి,తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి,తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వలందాస్ మురళి గౌడ్,కందాల రాము,గూడూరు మోహన్ రెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ కార్యదర్శి తీగుళ్ల మురళి గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు పెండం లక్ష్మీనారాయణ,మున్సిపల్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు భీమిడి కొండల్ రెడ్డి,మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూంకుంట జగదీష్ గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు టిఆర్ రవీందర్ గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి తీగుళ్ల దర్శన్ గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు చిర్రబోయిన రామచందర్ యాదవ్,సుతారి గూడెం దుర్గయ్య,బొల్లబోయిన నరసింహ యాదవ్,పోచంపల్లి సాయిలు,వార్డుల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలగామ జగన్,మునిగొండ నరేష్,గార్లు తదితరులు పాల్గొన్నారు .
28ఎస్పీటీ -1:పాడైన గుంతల రోడ్లను పారశీలిస్తున్న హరివర్ధన్ రెడ్డి, నాయకులు