గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసమే గ్రామ సభలు..
ఎంపీపీ లకావత్ మానస సుభాష్
హుస్నాబాద్ రూరల్ నవంబర్ 17(జనంసాక్షి) గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసమే గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ లకావత్ మానస, సర్పంచ్ పోలవేణి లత అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామ పంచాయతీలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి గ్రామసభ నిర్వహించారు.ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రతిపాదించాలని ఎంపీపీ మానస అధికారులకు సూచించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా తూము కాల్వ, మట్టి రోడ్డు,ఇంకుడు గుంతలు, కంపోస్ట్ షెడ్డు, ప్లాంటేషన్ పనులు, జల సంరక్షణ, నీటిని వృధా అరికట్టే పనులను, చెట్ల పెంపకం, రహదారి నిర్మాణ పనులు, ఫామ్ పౌండ్, గొర్రెల షెడ్లు, బర్రెల షెడ్లు, లాంటి ఎన్నో పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వినియోగించుకోవాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లలిత, గ్రామ వార్డు సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు.