గ్రామాల్లో మార్పు కోసం యువతరంగం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం అయ్యింది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఎన్నికలు కొంత డిఫరెంట్‌గా కనిపిస్తున్నాయి. రాజకీయాలవైపు పట్టభద్రులు ఆసక్తి కనబరుస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా యువత ఎన్నికలపై ఆసక్తి కనబర్చడం… ఎన్నికల బరిలో దిగడం ఈ ఎన్నికల విశేషంగా చెప్పుకోవాలి. అనేక గ్రామాల్లో పట్టభద్రులు,ఉన్నత విద్యావంతులు పోటీలో ఉన్నారు. ఎన్నారైలుగా ఉన్నవారు సైతం తమ ఉద్యోగాలను వదిలి గ్రామాల్లో సేవకోసం వచ్చారు. స్వగ్రామాలను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో యువతరం అడుగుపెట్టింది. ఇది రానున్న కాలంలో వస్తున్న మార్పులకు చిహ్నంగా చూడాలి. ఇప్పటి వరకు ఎన్నికల్లో ఎప్పుడూ పాతవారే రంగంలోకి దిగడం, గ్రామాలను పట్టించుచు కోకపోవడం, కొత్తగా ఆలోచన చేయక పోవడంతో విసుగుచెందిన అనేకమంది గ్రామస్థాయి నుంచి మార్పు కోరుకుంటున్నారు. అందుకే ఎన్నికల బరిలోకి డిగ్రీ, బీటెక్‌, పీజీ, పీహెచ్‌డి విద్యార్థులు కూడా పోటీకి దిగారు. అనేకమంది ఉద్యోగాలు వదిలేశారు. ప్రజాసేవ చేయాలన్న తపనతోనే విద్యావంతులు అనేకులు తమ గ్రామాల్లో పోటీకి నిలబడ్డారు. సంప్రదాయ పోటీకి భిన్నంగా తాము ఏమి చేయబోతున్నామో చెప్పి ప్రచారం చేస్తున్నారు. పట్టభద్రులు రాజకీయాలవైపు అడుగులు వేయడంతో గ్రామాల్లో సైతం ప్రజలు ఆదరిస్తున్నారు. చాలా గ్రామాల్లో మార్పు వస్తోంది. కొన్ని గ్రామాలను ఏకగ్రీవం చేశారు. ప్రజాసేవ చేయాలన్న తపన, గ్రామాలను మార్చుకోవాలన్న బాధ్యతతో వారు అడుగు ముందుకు వేశారు. విద్యావంతులతోనే మార్పు సాధ్యమన్న మేధావులు, నిపుణుల మాటలు, స్ఫూర్తితో యవనేతలు పల్లెపోరులో దిగారు. నిజానికి రానున్న కాలంలో రాజకీయ మార్పులకు ఇది నాందిగా భావించాలి. సంప్రదాయ రాజకీయాలను యువత అసహ్యించు కుంటున్నారని గుర్తుంచు కోవాలి. తక్షణ సమస్యల పరిష్కారం, అభివృద్ది లక్ష్యంగా వీరంతా తమకంటూ ఎజెండాను ఏర్పరచుకుని వచ్చారు. ప్రస్తుత రాజకీయ పార్టీల్లో పదవుల యావతప్ప ప్రజాసేవ మృగ్యమయ్యింది. అది కూడా వీరిని ఆలోచనకు గురి చేసింది. అందుకే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో డిగ్రీ, బీటెక్‌, పీజీ, పీహెచ్‌ చేసిన వారంతా ఇప్పటికే బరిలోకి దిగారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తూ, ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సామాజిక సేవ చేయాలన్న లక్ష్యంతోనే పోటీలో ఉన్నామనీ, తమను ఆదరిస్తే గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా పనిచేస్తామని స్పష్టం చేస్తున్నారు. యువనేతల స్ఫూర్తితో ప్రజాసేవ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే మార్పు తమతోనే మొదలు కావాలని భావిస్తున్నారు. అందుకే పంచాయతీ పోరును తొలిమెట్టుఆ ఎంచుకున్నామని అంటున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పెద్దసంఖ్యలో డిగ్రీ, బీటెక్‌, ఫార్మసీ, పీజీ, పీహెచ్‌ చేసిన యువతీ యువకులు సర్పంచ్‌ స్థానాల పోటీ పడుతున్నారు. ప్రజా సేవ చేయాలన్న సంకల్పం, యువత, విద్యావంతులతోనే ప్రగతి సాధ్యమన్న మాటలతో ఎన్నికల బరిలో నిలిచామని చెబుతున్నారు. తామంతా సర్పంచులగా ఎన్నికైతే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ప్రజా సేవ చేయాలనీ, గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఉందని కొందరు తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నారు. అందుకే ఈ సారి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నామని అంటున్నారు. తమకున్న జ్ఞానంతో సర్పంచ్‌గా గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామంటున్నారు. ప్రభుత్వం అందించే నిధులను వినియోగిస్తూ సమస్యలను పరిష్కరిస్తామనిచెబుతున్నారు. ఇక రిజ్వుడు సీట్లలో కూడా పట్టభద్రులు అనేకులు బరిలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అవకాశం కల్పిస్తూ రిజర్వేషన్లను కేటాయించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మా గ్రామంలో ప్రతీ ఒక్కరికి

చేరాలంటే చిత్తశుద్దితో పనిచేసే నాయకులురావాలి. అందుకే తాము రంగంలో ఉన్నామని పలువురు మహిళా విద్యావంతులు చెప్పారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలనీ, అవి అభివృద్ధి చెందితేనే దేశం పురోగాభివృద్ధి చెందుంతుందున్న గాంధీజీ మాటలతో స్ఫూర్తి పొందామని మరికొందరు చెబుతున్నారు. అందుకే మా గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది ఆదర్శంగా నిలపాలనే సంకల్పంతోనే సర్పంచ్‌ పోటీ చేస్తున్నామని అంటున్నారు. మహిళలుగా మా సత్తా ఏమిటో చాటుతాం. గ్రామపాలనలో పారదర్వకతతో పాటు వేగంపెంచుతాం అంటున్నారు. /ూజకీయాలు అంటే స్వలాభం కోసం చేసేవి కావు. గ్రామాభివృద్ధి తోడ్పాటునందించే విధంగా ఉండాలి. అందుకే సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచాం. మా గ్రామ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉంది. ఒక మ్యానిఫెస్టో తయారు చేసుకున్నాం. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తాం. సర్పంచ్‌గా తాము మాత్రమే అవినీతి రహిత పాలన అందించగలం. సంప్రదాయ లీడర్లు డబ్బులు ఖచ్చు పెట్టి మళ్లీ అవినీతి రాజకీయాలుచేస్తారు. గ్రామస్తుల సహకారంతో సమస్యలను త్వరితగతిన పరిష్కరి స్తామన్న నమ్మకంతో బరిలోకి దిగామని అంటున్నారు. రాజకీయాల్లో యువత ముందుంటే అన్నింటా అభివృద్ధి సాధ్యమవుతుంది. మాకు గ్రామానికి సేవ చేయాలన్న తపన ఉన్నది. అందుకే రాజాకీయాల్లోకి వస్తున్నాం. అభివృద్ధి కోసమే పోటీలో ఉన్నాం. గ్రామాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రజలందరి సహకారంతో ముందుకెళ్తాం. పుట్టి పెరిగిన ఊరుకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్‌ పోటీలో నిలిచాం అని అనేకులు నిర్మొహమాటంగా చెప్పారు. మొత్తంగా రాజకీయాల్లో మార్పును కోరుకుంటున్నారని, యువత సంప్రదాయ రాజకీయాలను అసహ్యించు కుంటున్నారనడానికి ఇదే నిదర్శనం.

—————————-

 

 

————————

———