గ్రామాల్లో రైతు చైతన్య యాత్రలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మండలంలోని కుంట్లపేట, పోచెపల్లి గ్రామాల్లో ఈ రోజు రైతు చైతన్య యాత్రలు జరిగాయి. ఖరీఫ్‌ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి మురళీధర్‌, ఉద్యానవన శాఖాధికారి టీ. ఎస్‌.రాయ్‌, పశువైద్యాధికారి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.