గ్రామాల విలీనం నిలిపివేయాలి..
మంత్రి కేటీఆర్‌ను కోరిన సర్పంచ్‌లు
రాజన్న సిరిసిల్లబ్యూరో, మే26(జనంసాక్షి)
సిరిసిల్ల మండలంలోని గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ గ్రామాల సర్పంచ్‌లు మంత్రి కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. శనివారం సిరిసిల్ల మండలంలోని ఏడు గ్రామాల సర్పంచ్‌లు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి విలీనం నిలిపివేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. విలీనం వల్ల ఉపాధి కోల్పోవడంతో పాటు ప్రజలపై భారం పడుతుందని మంత్రికి తెలిపారు. తరలివెళ్ళిన వారిలో సర్ధాపూర్ సర్పంచ్ అగ్గిరాములు, చంద్రంపేట సర్పంచ్ పులి శ్రీనివాస్, రాజీవ్‌నగర్ ముష్టిపల్లి సర్పంచ్ బాలాగౌడ్, రగుడు సర్పంచ్ పోచవేని గంగయ్యయాదవ్, ఆదిపెల్లి దేవాగౌడ్, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.