గ్రామీణ ప్రాంతాలలో మహిళా సంఘాలు మెరుగైన సేవాలందించాలి
మహిళ సంఘాలకు బయో మెట్రిక్ బాక్స్ లు అందజేత
అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలి
– అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి); జిల్లాలో మహిళా సంఘాలు మెరుగైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో సెర్ఫ్ వార్షిక ప్రణాళిక అమలులో భాగంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పిడి కిరణ్ కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మహిళ సంఘాలు బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, వివిధ పింఛన్లు, ఫామ్, నాన్ ఫామ్ లకు సంబందించిన 2022-23 సంవత్సరానికి సంబందించిన వార్షిక టార్గెట్ లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని సూచించారు.ఆయా సెక్టార్లలో మహిళ సంఘాలకు ప్రత్యేక తర్ఫీదులు కల్పిస్తూ, సంఘాల ఆర్ధిక బలోపేతానికి ప్రత్యేక కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే రుణాలు అందించుటలో,రికవరీ చేయుటలో ముందుండాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాలలో బయో మెట్రిక్ విధానం పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత బాక్స్ లను అందచేశారు.జిల్లాలో సంబంధిత అధికారులు, సిబ్బంది అలాగే వివిధ సంఘాలు జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు.అనంతరం మహిళ సంఘాలకు అందించిన వివిధ పథకాలపై అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సమావేశంలో అదనపు పీడీ సంజీవరావు, ఆర్ఏంఎల్డీఏం బాపూజీ , వేణుగోపాల్ రెడ్డి, డిపియంలు, ఏపియంలు, సిసిలు తదితరులు పాల్గొన్నారు.