గ్రామీణ విద్యార్థులకు ఊరట

1
– ‘ జనరల్‌ స్టడీస్‌’ తెలుగులో రాసే అవకాశం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జనంసాక్షి):

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగార్దులకు ఉపయోగపడే కీల కమైన నిర్ణయం తీసుకుంది. తెలం గాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వ హించే పరీక్ష జనరల్‌ స్టడీస్‌ను తెలుగులోనే నిర్వహించాలని నిర్ణ యించారు. ఈ మేరకు వారికి హా విూ ఇచ్చారు. ఈ నెల 20న ఏఈ ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్ష జరగ నున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష కు జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ఇంగ్లీస్‌లో నిర్వహించాలని మొదట నిర్ణయిం చారు. గ్రావిూణ ప్రాంతాల నుంచి పరీక్ష రాసే అభ్యర్థులకు జనరల్‌ స్టడీస్‌ పరీక్ష ఇంగ్లీష్‌లో నిర్వహిం చడం వల్ల నష్టం జరుగుతుందని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అభ్య ర్థుల విజ్ఞప్తి మేరకు సమావేశం నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ను తెలుగులో నిర్వ హించాలని నిర్ణయించింది. రెండో పేపర్‌ మాత్రం ఇంగ్లీష్‌లో రాయా ల్సి ఉంటుంది.  గ్రావిూణ ఉద్యోగా ర్ధులు కావాలనుకుంటే తెలుగులో జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ రాయవచ్చని ప్రకటించింది. ఆదివారం నాడు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌ లైన్‌ లో పరీక్షలు నిర్వహి స్తుంది. ఎఇఇ ఉద్యోగాలకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. తొలిసా రిగా కమిషన్‌ ఈ తరహా పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్ష కేంద్రం నుంచి ఆన్‌ లైన్‌ లో పరీక్షలు రాయడానికి వీలుగా అన్ని ఏర్పా ట్లు చేసినట్లు సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి చెప్పారు. అయితే పలువురు ఉద్యోగార్దులు కోరిన మేరకు తెలుగులో కూడా జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ ను ఇస్తున్నామని ఆయన తెలిపారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ విషయమై సవిూక్ష చేసి ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహిచే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశామని చక్రపాణి చెప్పారు.