గ్రామ పరిశుభ్రత కోసం చెత్తను తీసిన సర్పంచ్ భర్త

వీర్నపల్లి, జూలై (జనంసాక్షి): పాలకులు అంటే ఖద్దర్ బట్టలే కాదు అవసరం ఉన్నప్పుడు కార్మికుల్ల మారి ప్రజా సేవ చేయడమే అని గర్జనపల్లి గ్రామ సర్పంచ్ గొర్రె కరుణ భర్త రంజిత్ నిరూపిస్తున్నాడు. గ్రామ పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేయడంతో గ్రామంలో ఎక్కడ చూసిన మురికి, చెత్తతో ప్రత్యక్షమయ్యాయి. దానిని చూసిన సర్పంచ్ గొర్రె కరుణ భర్త చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో వేసుకొని డంప్ యార్డుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి నెరవేర్చాలని కోరారు. సమ్మె సమయంలో గ్రామ ప్రజలు మురికితో రోగాల భారిన పడే అవకాశం ఉందని, తన వంతు సాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న సర్పంచ్ భర్త రంజిత్ ను పలువురు అభినందిస్తున్నారు.

తాజావార్తలు