గ్రావిూణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా పనులు
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కులవృత్తులకు చేయూత
రానున్న రోజుల్లో మారనున్న గ్రామాల స్థితిగతులు
హైదరాబాద్,జనవరి18(జనంసాక్షి): తెలంగాణలో గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కులవృత్తులకు చేయూత,నీటి సంరక్షణ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే వ్యవసాయ పరిరిక్షణ ఉద్యమం కూడా సాగుతోంది. దేనికైనా కొంత సమయం కావాలి. తెలంగాణలో కులవృత్తును బలోపేతం చేయడం అన్నది గ్రావిూణ అర్థిక వ్యవస్తను బలోపేతం చేసేదిగా గమనించాలి. పరిశ్రమల పేరుతో పర్యావరణాన్ని నాశనం చేసుకునే కన్నా మన వ్యవసాయ పరిశ్రమను బాగు చేసుకోవడం మంచిది. తెలంగాణలో నీటి లభ్యత క్కువ. తాగడానికే నీళ్లు లేవు. ఇక సాగునీరు సంగతి సరేసరి. ఈ రెండు లక్ష్యాల కోసం తెలంగాణలో మిషన్ కాకతీయ,మిషన్ భగీరత కార్యక్రమాలు చేపట్టారు. వీటి ఫలాలను ప్రజలు త్వరలోనే అందుకోబోతున్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తుంటే అప్పులు చేస్తున్నారంటూ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న వారు గతంలో వేలకోట్లు దుబారా గురించి మాట్లాడడం లేదు. నిరంతర విద్యుత్ గురించి విమర్శలు చేసేవారు గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పడం లేదు. ప్రభుత్వాలు ఏర్పడటం, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ఆర్భాటాలు చేయడం, పథకాలను చివరికి పేపర్లకు అంకితం చేయడం మనం దశాబ్దాలుగా చూస్తున్నదే. కానీ ఇప్పుడు అలా కాకుండా క్షేత్రస్థాయిలో పనులు జరుగుతన్నాయి. ప్రధానంగా చెరువుల పునరుద్దరణ అన్నది పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల్లో సాగుతోంది. అందులో చేపల పెంపకం అన్నది గ్రావిూణ ఉపాధికి ఊతం ఇచ్చే కార్యక్రమంగా చూడాలి. అలాగే పెద్ద ఎత్తున గొర్రెల పెంపకం అన్నది కూడా కులవృత్తులను బలోపేతం చేసేదిగా చూడాలి. వ్యవసాయానికి పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది. అందుకే కంది,మిర్చి, పసుపు పంటల దిగుబడి పెరిగింది. వరి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సదీర్ఘ కాలం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా వ్యవసాయంతో సహా గ్రామాల వికాసానికి ఎలాంటి మార్పులు తీసుకోలేదు. ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా నేటికీ గ్రామాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. జన సంక్షేమమే అంతిమ ఎజెండాగా పనిచేసే వారే నిజమైన పాలకులు అని మహాత్మాగాంధీ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తేనే పథకాలు సాకారం అవుతాయి. వ్యవస్థ బాగుపడాలన్న సంకల్పంతో ఉపయోగపడే పనులకు తొలి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సాగుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ దశలో గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న కృషి మాత్రం అభినందనీయం. గ్రామాలను పరిపుష్టం చేసే దిశగా అనేక కార్యక్రమాలు సాగుతున్న తీరు ఇరత రాష్ట్రాలకు ఆదర్శం కావాలి. కార్యక్రమాలు ఏవైనా, పేర్లు ఏవైనా ఇరురాష్ట్రాల్లో ఇంచుమించుగా ఒకేతరహా కార్యక్రమాలు సాగుతున్నాయి. స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు అందించి, అంతటా అభివృద్ది అన్న నినాదమే అసలైన పాలన. అలాంటి ఆరోగ్యకర వాతావరణం ఇప్పుడు తెలుగునేలపై సాగుతోంది. ప్రతిపక్షనాయకులుగా రోజూ విమర్శించే వారితో పాటు ప్రభుత్వాన్ని నిత్యం విమర్శించే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అందరూ తమ నియోజకవర్గాల్లో సాగుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఇలాంటి అసమానతలు లేని విధానాన్ని రూపొందించడం వల్లనే గ్రామాలు అభివృద్ది చెందుతాయి. ఎక్కడా విలువలు తప్పకుండా, పారదర్శకత విస్మరించకుండా అనేక పథకాలు సాగుతున్నాయి. బీళ్లు బారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో, గొంతెండుతున్న జనం కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన పథకాలు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. రాష్ట్రంలో ఇప్పటికీఅధిక శాతం గ్రావిూణ ప్రాంతాలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చెలమల నుంచి వచ్చే నీటిని అక్కడి ప్రజలు తాగి అనారోగ్యం బారినపడుతున్నారు. నీటిని అందించే పథకాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు వచ్చే నిధులకు సమానంగా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు అందాయి. అంతటా ఒకేవిధమైన అభివృద్ధి సాగుతుంది. అంతటా గొలుసుకట్టు చెరువులన్నీ వరుసకట్టి అలుగుపోస్తున్నాయి. వివిధ పథకాలు సమర్థవంతంగా అమలుచేయడానికి ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం, స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఎపిలో పంటకుంటల నిర్మాణం, రెయిన్‌గన్లతో పంటలను కాపాడం ద్వారా ఎపిలో వ్యవసాయపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా గ్రామాలను ఆధారం చేసుకుని కార్యక్రమాలు చేస్తేనే అభివృద్ది సాధ్యం. అందుకు తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా మారితే అంతకు మించిన భాగ్యం మరోటి లేదు. సుదీర్ఘకాలం తరవాత గ్రావిూణాభివృద్ధి దిశగా కీలక చర్యలు చేపడుతున్నారు. పల్లె ప్రజలను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకువస్తున్నాయి. వేల కోట్లతో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రక్షిత నీటిని సరఫరా చేసేలా ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ముఖ్యమైనది. దేశంలోనే మొదటిసారిగా గ్రావిూణ ప్రాంతాల్లోనూ భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఎల్‌ఈడీ వీధి దీపాలతో పల్లెలను వెలిగించాలన్నది మరో ప్రతిపాదన. వీటికి నిధులు సవిూకరించి గడువులోగా పనులు పూర్తి చేస్తే గ్రావిూణాభివృద్ధిలో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.