గ్రూప్-2కు సర్వం సిద్ధం
ఖమ్మం, జూలై 19 : ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో 57 కేంద్రాలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. వీటన్నింటిలో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు 20,982 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. 17 రూట్లుగా విభజించి 17 మంది లైజర్ అధికారులను నియమించామన్నారు. 57 మంది అసిస్టెంట్ లైజర్ అధికారులను నియమించామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కో- ఆర్డినేటింగ్ అధికారిగా ఖమ్మం, కొత్తగూడెం ఆర్డీఓలు అడిషనల్ కో-ఆర్డినేటింగ్ అధికారులుగా నియమించామని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.