గ్రేటర్‌కు సిద్ధం కండి

– దుబ్బాకలో రఘునందన్‌ గెలుపు వ్యక్తిగతమే..

– డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు!

– అందులో భాజపా ప్రభావం ఉండబోదు

– కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌

– ‘జనంసాక్షి’ విశ్వసనీయ సమాచారం

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రి వర్గసహచరులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం జరిగిన మంత్రి వర్గభే టిలో ఈ మేరకు చర్చించినట్లు ‘జనంసాక్షి’కి విశ్వసనీయ సమాచారం అందింది.దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌ గెలుపు ఆయన వ్యక్తిగతమని,దీని ప్రభావం రాష్ట్రంలో కాని ,జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గాని ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో జరిగిన అబద్ధపు ప్రచారాలతో ఒక సీటు గెలిచి ఉండవచ్చుకానీ అబద్ధపు ప్రచారాల పునాదులపై వచ్చేవాళ్లు ఎక్కువ కాలం ఉండజాలరని, సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌,నవంబరు 13(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం నిర్వహించిన కేబినెట్‌ మీటింగ్‌లో మంత్రి వర్గ సహచరులకు సూచించినట్లు ‘జనంసాక్షి’కి విశ్వసనీయ సమాచారం అందింది. అలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్‌ నెలలోనే నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే సమావేశంలో జిహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆలస్యం చేస్తే బీజేపీ లబ్దిపొందే ప్రమాదం ఉందని అభిప్రాయపడట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ అనంతరం తర్వాత రెండు, మూడు రోజుల్లో జిహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయ్యేలా చూడాలని కేబినెట్‌లో చర్చకు వచ్చింది.సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం ఏమాత్రం జిహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉండదని తెలిపినట్లు సమాచారం. రఘునందన్‌రావు స్థానికంగా ఉన్న సానుభూతితోనే గెలిచాడే తప్ప, బిజెపి ప్రభావంతో కాదని కేబినెట్‌ భేటీకి ముందు రోజు సిఎం కెసిఆర్‌ మంత్రులతో చెప్పిన విషయం తెలిసిందే. గతంలో మూడు సార్లు ఓడిపోయారన్న సానుభూతితో రఘనందన్‌ కు ఈసారి అత్యధిక ఓట్లు పడ్డాయని, దానిని బిజెపి గెలుపుగా భావించవద్దని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కరోనా స్థితిగతులు, ధరణి, రెవెన్యూ సంబంధిత అంశాలు, పంటలసాగు, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు … వచ్చింది. గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాల విషయమై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ అంశం తర్వాత జిహెచ్‌ఎంసీపై చర్చ జరిగిందని తెలు స్తోంది. డిసెంబర్‌ మొదటి వారంలోనే ఎన్నికలకు వెళ్లాలనే చర్చకు కేబినెట్‌ భేటీలో సీఎం కేసీఆర్‌ స్పష్టంచేసినట్లు తెలుస్తోంది జిహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆలస్యమైతే విపక్షాలకు సమయం లభిస్తుందన్నారు.ఆపార్టీలకు అభ్యర్థులుకూడా దొరకడం కష్టమేనని, చేరికలకుకూడా చాన్స్‌ ఇచ్చి నట్లవుతుందని అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైంది. నగర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలకు విస్తృతంగా ప్రజ ల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఓట్లు సాధించాలని సిఎం కెసిఆర్‌ స్పష్టంచేశారు. ఈ భేటీలో సాదా బైనామాల క్రమబద్దీకరణ చట్టసవరణతో పాటు మిగతా అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.