గ్రేటర్‌లోనామినేషన్ల బోణీ
హైదరాబాద్,నవంబర్18 (జనం సాక్షి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాజపా నుంచి 2, కాంగ్రెస్ 3, తెరాస 6, తెదేపా నుంచి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. గుర్తింపు పొందిన మరో పార్టీ నుంచి ఒకరు, స్వతంత్రులు 3 నామినేషన్లు దాఖలు చేశారు. బరిలో నిలిచే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. నామినేషన్ల సమర్పణకు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నందున రేపు, ఎల్లుండి అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.