గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దానం రాజీనామా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైఫల్యంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు దానం ప్రకటించారు. గ్రూపు తగాదాల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు పూర్తి బాధ్యత ఇవ్వకున్నా… శక్తి మేరకు పనిచేశానని తెలిపారు.