గ్రేటర్‌ మాదే!

4

– పూర్తి మెజారిటీ సాధిస్తాం

– సర్వేలన్నీ అనుకూలం

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 2(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెరాస గెలుపు ఖాయమని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస కోసం తీవ్రంగా శ్రమించిన నేతలు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ ప్రజలు ఓటింగ్‌లో తక్కువశాతం పాల్గొనడంపై కేటీఆర్‌ అసంతృప్తి

వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ… ఓట్లు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడం సరికాదన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఏడు సంస్థలు విడుదల చేసిన సర్వేలు తెరాస గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. పాతబస్తీలో ఎంఐఎం, కాంగ్రెస్‌ కార్యకర్తల ఘర్షణ, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నివాసంపై దాడి ఘటనలు దురదృష్టకరమన్నారు. కాకపోతే పోలింగ్‌ శాతం మరింత పెరిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదని అన్నారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా ఇంట్లో కూర్చున్నారి తెలిపారు. ప్రస్తుతం జరిగిన పోలింగ్‌ 50 శాతం వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నామన్నారు.  ఎంఐఎం, కాంగ్రెస్‌, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ మధ్య ఉధ్రిక్త సంఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. పోలీసులు నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. జరిగిన సంఘనటలు కూడా పోలింగ్‌ కేంద్రాలకు వంద కిలోవిూటర్ల అవతల జరిగాయని ఎక్కడైనా రీపోలింగ్‌ ఉంటే ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిగాయనేందుకు తమ పార్టీ వారిపై కూడా కేసులు నమోదు కావడం నిదర్శనమన్నారు. మరోవైపు బల్దియాపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఖాయమని తేల్చి చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌ 75 నుంచి 85 సీట్లలో గెలిచి తీరుతుందని వెల్లడిస్తున్నాయి.

ఏడు ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పాతబస్తీలో ఘటనలు దురదృష్టకరమన్నారు. వాటిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. పోలింగ్‌ గతం కంటే పెరిగినా.. ఇంకా పెరిగితే బాగుండేదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. పోలింగ్‌ శాతం పెరిగితే టిఆర్‌ఎస్‌ కు ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చేదన్నారు. ప్రజాస్వామ్యంలో పోలింగ్‌ కు దూరంగా ఉండటం మంచిదికాదన్నారు. భవిష్యత్తులో పోలింగ్‌ శాతం పెంచేందుకు కృషి చేస్తామన్నారు. టిఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారందరికి మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు అ¬రాత్రులు కష్టపడి పనిచేశారని చెప్పారు. టిఆర్‌ఎస్‌ విజయాన్ని తమ భుజాలపై వేసుకొని పనిచేసిన వారందరికి కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికలను ఎలక్షన్‌ కమిషన్‌, పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ఉద్యోగులు పారదర్శకంగా నిర్వహించారని కేటీఆర్‌ ప్రశంసించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. సీపీఐ నారాయణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు కేటీఆర్‌. ఓడిపోయే వాళ్లు ముందుగానే కుంటిసాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టించిన పార్టీ అని, దేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్‌, మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు.