గ్రేటర్‌ హైదరాబాద్‌లో చీరల పంపిణీ 

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 24  జనం సాక్షి : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నగరంలోని బన్సీలాల్‌పేటలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆడపచులకు మంత్రి బతుకమ్మ కానుకలను అందజేశారు. ఇష్టమైన చీరలను అందుకున్న మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.