గ్రేటర్ జర భద్రం..
జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కరోనా కేసులు
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి
తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 13(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉ న్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సోమవారం ప్రగతిభవన్లో నిర్వహించిన సమీక్షకు మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతా ధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, చికిత్స పొందు తున్న వారిలో మరొకరు మృతి చెందారని అధికారులు సీఎంకు తెలిపారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 592కి చేరిన ట్లు చెప్పారు. ఎక్కువగా కేసులు నిర్ధారణ అవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఈ సం దర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం నగరంలోని 17 సర్కిళ్లను 17 జోన్లు గా విభజించి ప్రత్యేక అధికారులను నియమిం చాలని తద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైద్యఆ రోగ్యశాఖతో పాటు రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖల అధికా రులను ఆయా జోన్లకు నియమించి వారి ద్వారా ప్రత్యేక కార్యాల ‘రణ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతిరోజూ జోన్ల వారీ గా సమీక్షించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సీఎం సూ చించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దానికి అను గుణంగా సిద్ధం కావాలని వైద్య ఆరోగ్యశాఖ
‘ జర భద్రం… అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ల్యాబ్లతో పాటు ఆస్పత్రులను సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. లా డౌన్ పొడిగించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని మరోమారు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మాస్కు ధరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేస్ మాస్క్ ధరించారు. సోమవారం ప్రగతిభవన్లో అధికారులతో సమీక్ష సందర్భంగా కేసీఆర్ మాస్క్ ధరించి సమావేశంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీకి ముందు చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకున్నారు. కొవిడ్ వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలవుతున్న తీరు, పేదలకు అందుతున్న సాయం, పంట ఉత్పత్తుల కొనుగోళుజరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడానికి పలువురు ప్రముఖులు ప్రగతిభవన్‌కు వస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా సీఎం కేసీఆర్ మాస్క్ ధరించి సమావేశాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.