గ్రేటర్ లో ఓడిపోతే రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్

2గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 100 సీట్లను గెలుస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం టీఆర్ఎస్ దేనని తేల్చిచెప్పారు.ఐటీ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీని గ్రేటర్ ఎన్నికల్లో నిలపలేకపోతే మంత్రి పదివికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దమ్ముంటే ప్రతిపక్షాలు ఓడిపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు హైదరాబాద్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….కేటీఆర్. గెలిచే సత్తా ఉన్న పార్టీలే బరిలో నిలవాలంటూ సవాల్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ జెండా గ్రేటర్ పీటంపై ఎగరకపోతే రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీలు హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. TUWJ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని విషయాలపైనా మంత్రి కేటీఆర్ సవివరంగా మాట్లాడారు. ప్రభుత్వ అభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు. నాలుగైదు రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారాయన. హైదరాబాద్ లో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.
హైదరాబాద్ ను సేఫ్, క్లీన్, గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. దేశంలో ఎ క్కడా లేని విధంగా స్లమ్ రీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం సిటీలో జరుగుతుందన్నారు. ప్రజల మౌలిక అవసరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కచ్చితంగా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తీరును కడిగి పారేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ అభివృద్ధికి ఆ పార్టీలు చేసిందేమీ లేదన్నారు.18 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు మంత్రి కేటీఆర్.
ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేశామన్నారు మంత్రి కేటీఆర్. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీపడలేదని గుర్తు చేశారు. కచ్చితంగా గ్రేటర్ పై గులాబీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.