గ్రేట్ వే పాఠశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 24, (జనంసాక్షి): మండల కేంద్రంలో గ్రేట్ వే, చైతన్య పాఠశాలల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బ్రహ్మచారి మాట్లాడుతూ పండుగలు మత సామరస్యానికి ప్రతీకలని, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. సహజ సిద్ధంగా దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను నిర్వహిస్తారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందని అన్నారు. ఇంకా బతుకమ్మ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరింప చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేట్ వే పాఠశాల ప్రిన్సిపాల్ బ్రహ్మచారి, చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస చారి డైరెక్టర్ వీరారెడ్డి, ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి వంగూరు శ్రీనివాస్, యాదగిరి, నగేష్ అశోక్ పరమేష్,, శోభ, మంజుల, శరణ్య, శ్రీలత, మోక్ష, రజియా, సరిత, లక్ష్మి, మాధవి, తన్వీర్, పాఠశాల సిబ్బంది, పేరెంట్స్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.