*గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డుకు సుధాకర్ ఎంపిక.
చిట్యాల సెప్టెంబర్2(జనంసాక్షి) మండలంలోని చల్లగరిగకు చెందిన సీనియర్ జర్నలిస్టు వెలుగు రిపోర్టర్ తడుక సుధాకర్ గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపికయ్యారు.
స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ ఇండిపెండెన్స్, ఇంటర్నేషనల్ యూత్ డే సంబరాల్లో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఉత్తమ సోషల్ వర్కర్లను గుర్తించి ప్రశంసాపత్రాలు, అవార్డులను ప్రధానం చేస్తున్నట్లు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. ఈ నెల 10న హైదరాబాద్ లోని నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలో గల ఎన్టీఆర్ ఆడిటోరియంలో ఎంపికైన ఉత్తములకు అవార్డులను ప్రధానం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. చిట్యాల సీనియర్ జర్నలిస్టు, వెలుగు రిపోర్టర్ తడుక సుధాకర్ సామాజిక కోణం, మానవీయ కోణాలతో రాసిన కథనాలను పరిశీలించిన స్ఫూర్తి సర్వీస్ సొసైటీ వారు గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు శుక్రవారం తెలిపారు. చల్లగరిగకు చెందిన సుధాకర్ ఉషోదయం, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సూర్య, నమస్తేతెలంగాణలో పనిచేసి ప్రస్తుతం వెలుగు రిపోర్టర్ గా కొనసాగుతున్నాడు. గత 23ఏళ్లుగా సామాజిక, మానవీయ కోణంలో వార్త కథనాలు రాస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందని, సుధాకర్ కథనాలను పరిశీలించి గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ చైర్మన్ ఆకుల రమేష్ అన్నారు. తన కథనాలను చూసి గ్లోబల్ సోషల్ వర్కర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు గాను స్ఫూర్తి సర్వీస్ సొసైటీ చైర్మన్ ఆకుల రమేష్ కు ఈ సందర్భంగా తడుక సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.




