గ్వాలియర్, కోజికోడ్ కు యునెస్కో గుర్తింపు
న్యూఢల్లీి(జనంసాక్షి): గ్వాలియర్, కోజికోడ్ సిటీలకు యునెస్కో గుర్తింపు లభించింది. సంగీ తం విభాగంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలి యర్, సాహిత్యంలో కేరళలోని కోజికోడ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబి తాలో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యా ప్తంగా మొత్తం 55 నగరాలను సెలక్ట్ చేయ గా అందులో మనదేశానికి చెందిన రెండు సిటీలకు స్థానం లభించింది. అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సంద ర్భంగా యునెస్కో తన అధికారికి వెబ్ సైట్ ద్వారా ఈ విషయా న్ని తెలియజేసింది. దీంతో యునెస్కో క్రియేటివ్ సిటీస్ మొ త్తం సంఖ్య 350కి చేరుకుంది. కోజికోడ్ లిటరేచర్ ఫెస్టివల్స్, బుక్ ఫెస్టివల్స్?కు వేదికగా ఉంది. దీంతో సిటీ ఆఫ్ లిటరేచర్ గా గుర్తింపు దక్కించుకుంది. శాస్త్రీయ సంగీతానికి పెట్టిన పేరుగా గ్వాలియర్?కు గుర్తింపు ఉంది. అక్బర్ కాలం నాటి ఆస్థాన గాయకుడు తాన్సేన్ కూడా ఈ నగరానికి చెందినవారే కావడం విశేషం.