ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేడుకలు

టేకులపల్లి, ఆగస్టు 9( జనం సాక్షి): అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని టేకులపల్లి మండలంలోని పాత లచ్చగూడెం, కిష్టారం గ్రామపంచాయతీ లోని రోడ్డు గుంపు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతయ ఆదివాసీ దినోత్సవములో చింతోని చిలక సర్పంచ్ వీసం నీలమయ్య చేతుల మీదుగా జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ శ్రీనివాసరావు పాల్గొని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతూ1982 లో మొదటి సభ జనివాలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సభలో పాల్గొన్న 192 దేశాలు ఏకగ్రీవంగా 1994 న ఆగస్ట్ 9 న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. ప్రకృతిలో మమేకమైన జీవనం, డోలు చప్పుళ్ళు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు ఆదివాసీ జీవన శైలి అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన ఆదివాసీ జీవన స్థితగతులు మారలేదన్నా రు.ఆదివాసుల హక్కులు పరిరక్షణ కోసం 1994 లో ప్రకటించిన అనంతరం ప్రతి ఏడాది ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా జరుపు కోవడం జరుగుతుందన్నారు. పాలకులు ఎంత మారినా ఈ అడవి బిడ్డల బతుకులు మారడం లేదని, ప్రకృతి బడినే ఆవాసంగా దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేచుకుంటు ప్రకృతి ప్రాసాదిత ప్పలలాతో జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికీ విద్య, వైద్యo , మంచినీరు , రోడ్లు వంటి సౌకర్యాలు కూడ లేని గ్రామాలు ఏనో ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమములో పునెం స్వప్న ఎంపీటీసీ, కిష్టారం సర్పంచ్ జబ్బా విజయలక్ష్మి, మేళ్ల మడుగు సర్పంచ్ మాడె మధు, కొమరం చిట్టిబాబు, చింత సంపత్, కురసం నగేష్ , కురసo దొర ఉపసర్పంచ్, నరసింహారావు, ఊకె లక్ష్మయ్య, కొరస పాపారావు, కొరస రామక

తాజావార్తలు