ఘనంగా కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలు
భద్రాచలం : ఖమ్మంలోని భద్రాచలం క్షేత్రంలో కంచర్ల గోపన్న 380వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాగ్గేయకారుల చిత్రపటాలతో ఆలయ సన్నిధి నుంచి వూరేగింపుగా నగర సంకీర్తన చేశారు. అనంతరం సన్నిధిలోని రామదాసు విగ్రహానికి పవిత్ర గోదావరి నుంచి జలాలు, పంచామృతాలతో వేద పండితులుఅభిషేకం నిర్వహించారు. చిత్రకూట మండపంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత కళాకారులతో నాద నీరాజన కార్యక్రమాన్ని నిర్వహించారు.