ఘనంగా చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): భారత స్వాతంత్ర్యోద్యమ నాయకులు, బ్రిటిష్ ముష్కరులను తుదముట్టించిన యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి వేడుకలను శనివారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సైదులు, పిడిఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేష్  మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు.నేటి యువత ఆజాద్ ను ఆదర్శంగా తీసుకొని పీఎం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.దేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు అప్పనంగా కట్టబెడుతున్నారని, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం మూలంగా ద్రవ్యోల్బణం ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని పేర్కొన్నారు.పెద్ద నోట్ల రద్దు నుండి జీఎస్టీ వరకు ప్రజలను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు కిరణ్ , చందర్రావు, పీవైఎల్ జిల్లా నాయకులు వీర బోయిన రమేష్, వీరబోయిన లింగయ్య , పవన్, ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్ , సంజీవరెడ్డి , వీరారెడ్డి , వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు