ఘనంగా జగ్జీవన్‌రాం అంబేద్కర్ జయంతి వేడుకల నిర్వహణ
ఆదిలాబాద్,మార్చి31(జనంసాక్షి): బాబు జగ్జీవన్‌రాం, డా.బి.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో వీటిని ఘనంగా నిర్వహించనున్నారు. ఇతరప్రముఖుల జయంతిలా మాదిరిగా నిధులు ఎక్కువగా కేటాయించాలని, డైట్‌మైదానంలో భారీ వేదికను ఏర్పాటుచేసి ఇతర ప్రాంతాల నుంచి వేలాది మందిని తరలించాలని విన్నవించారు. ఈ ఉత్సవాలకు అందరూ సహకరించాలని ఇటీవల సవిూక్షించిన ఎస్సీ కార్పోరేషన్ ఈడీ కల్వాలే జేమ్స్ పేర్కొన్నారు. ఆయన దళితసంఘాల ప్రతినిధులతో జయంతి వేడుకల నిర్వహణపై సవిూక్షించారు. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్, ఏప్రిల్ 14న డా.బి.ఆర్.అబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని తెలిపారు. దళితసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ఊరేగింపునకు అనుమతినివ్వాలని కోరారు. సభకు వచ్చేవారికి కనీసవసతులు కల్పించాలన్నారు. వేడుకల్లో ప్రతి శాఖ అధికారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తప్పక హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. మహానాయకులకు పుస్తకాలను విద్యార్థులకు ఇచ్చి వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలన్నారు. మండల, డివిజన్‌స్థాయిలో ఏ అధికారి హాజరుకావడంలేదని, ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని కలెక్టర్ జగన్మోహన్ కూడా పేర్కొన్నారు. వేడుకల నిర్వహణపై దళితసంఘాల ప్రతినిధులతో సవిూక్షించారు.
దళితసంఘాల ప్రతినిధులందరికీ ఆహ్వానపత్రికలు అందించాలని ఎస్సీకార్పోరేషన్ ఈడీని ఆదేశించారు. వేడుకల సందర్భంగా భోజనవసతిని కల్పించాలని దళితఅభివృద్ధిశాఖ సంయుక్తసంచాలకుడిని ఆదేశించారు.