ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు..
ఊరుకొండ, సెప్టెంబర్ 17 (జనంసాక్షి):
జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా ఊరుకొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. శనివారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఎంపీడీవో కార్యాలయం మీద ఎంపీపీ బక్క రాధ జంగయ్య, తహసిల్దార్ కార్యాలయం పైన తాసిల్దార్ జాకిర్ అలీ, వివిధ కార్యాలయాలలో ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ పోరాట వీరులను స్మరించుకుంటూ జాతి నిర్మాతలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎందరో పోరాట ఫలితమే తెలంగాణ సాధ్యమైందని ఆమె గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అడుగుపెట్టి నీటికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజలు ప్రజలు పాల్గొన్నారు.