ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
హాజరైన మహిళా కమిషన్ చైర్పర్సన్
నర్సాపూర్. సెప్టెంబర్, 30, (జనం సాక్షి)
దేవీ నవరాత్రి ఉత్సవాలు నర్సాపూర్ పట్టణంతోపాటు నియోజకవర్గం లో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని ధర్మశాల లో ఏర్పాటు చేసిన దుర్గా దేవి అమ్మవారి కి శుక్రవారం నాడు పట్టణ ప్రజలు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి, మునిసిపల్ చైర్మన్ మురళి యాదవ్ తదితరులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉత్సవాలలో నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే ఉత్సావాల్లో భాగంగా నల్లపోచమ దేవాలయం లో మాజీ ఎంపిపి రమణారావు ప్రత్యేక పూజలు చేశారు.
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 1 అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భారత మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత రెడ్డి
ఫోటో రైట్ అప్ ఎన్ ఎస్ పి 2 అన్నదానం లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్