ఘనంగా పండిట్ దీన్ దయాళ్ జయంతి వేడుకలు.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెం బర్25
పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని నిర్మాణం చేసిన ఘనత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయకే దక్కుతుందని బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు అన్నారు.మల్కాజిగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పండిట్ దీన్ దయాళ్ జయంతి సభకు మరళీధర్ రావుతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.దేశం కోసం నీతివంతంగా,నిబద్దత,నైతికతతో పనిచేయాలని దీన్ దయాళ్ చెప్పారని ఈసందర్భంగా దత్తాత్రేయ అన్నారు. ప్రపంచమంతా క్యాపిటలిజం, సోషలిజం అనే రెండు విధానాల ద్వారానే ముందుకు సాగుతోందని. భారతీయ సంస్కృతి,రాజకీయ విధానానికి అనుగుణంగా ఎకాత్మక మానవ వాదం తీసుకొచ్చారని గుర్తు చేశారు.అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు తీసుకెళ్లినప్పుడు సమగ్ర అభివృద్ది సాధ్యమని వివరించారు.