ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మళనం……………………………………………….

అక్కడ ఒకరిని మరొకరు ఆలింగనాలు, చేసుకుంటూ, యోగ క్షేమాలూ తెలుసుకుంటూ, పిల్లలు, మనమల, మనమరాళ్ల ముచ్చట్లు అడిగి తెలుసుకుంటూ, కొద్ది సేపు హై స్కూల్ లో చదువుల రోజులకు వెళ్లి పోయారు. కొందరు చాలా కాలానికి కలసినందుకు సంతోషంగా కండ్ల నీళ్లు తీసుకున్నారు. హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి అందరు ఇందులో కనిపించారు. ఒక సిక్కు దోస్తుకు కష్టాల్లో ఉన్నాడని తెలుకుని ఒక 50,000 రూపాయలు సహాయం అందచేశారు. ఒకరి పట్ల, మరొకరి పైన ప్రేమ, అభిమానం ఉట్టిపడింది.మన భారతదేశం అంతా ఇలాగే ఉంటే ఎంత మంచిగా ఉండేది అని ఆ కొద్దిగంటలు అనిపించింది.మంచిర్యాల లోని ఒక హలులో మంగళవారం మందమర్రి జెట్పిఎస్ఎస్
పూర్వ విద్యార్థిని, విద్యార్థుల ద్వితీయ ఆత్మీయ సమ్మేళనం.( ఆత్మీయ కలయిక)1979’1980 ఎస్ ఎస్ సి బ్యాచ్ మిత్రులు మంగళవారం 100 మంది భార్య, భర్తలు పాల్గొనడం జరిగింది.చిన్ననాటి సంఘటనలు , చదువుకున్న మధుర అనుభూతులు నెమరు వేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో కన్వీనర్ లగిశెట్టి చంద్రమౌళి కో కన్వీనర్ శ్రీవాణి,అంజలి
ఎం. కవిత విజయవాడ.
ఎ. రాజయ్య, ఎం.కాంతారావు, పి .వెంకటస్వామి,. వెంకట్రావు. రాజారెడ్డి, వెంకటేశ్వర్లు,
శంకర్,. రవి, మొగిలి
, వెంకటేశ్వర్లు, ఎ. శ్రీనివాస్.అమ్మాజీ , రిజ్వానా మునీర్ బాయ్, మరియు,
సత్యం,
ఎ.రవి ,కే వి. రావు
రమేష్,గౌస్,
రాజయ్య,మొగిలి, మల్లేష్, నాగరాజు, వెంకటేశ్వర్లు ఢిల్లీ. మల్లేష్, రమేష్, ,. రాజలింగు, కృష్ణ, ప్రభాకర్, రాజలింగు, సమ్మయ్య . దుర్గయ్య
.దివాకర్ రావు. మున్సుద్ భాయ్. సర్జిత్ సింగ్ తదితరులు పలుగున్నారు. సంస్కృత కార్యక్రమంలో భాగంగా ఆటలా పోటీలో విజేతలకు గురువుల చేతి మీద బహుమతులు ఇవ్వడము జరిగింది. తర్వాత గురువులు
హెడ్ మాస్టర్ వి ఎల్.లక్ష్మీనారాయణసర్
ప్రేంసాగర్ సార్,
ఇరువురిని గురువులను ఘనంగా సన్మానించడం జరిగింది.
వారికి జీవితాంతం మా మిత్ర బృందం రుణపడి ఉంటారని. మరియు వారికి పదివేల నమస్కారాలతో నమస్కరిస్తూ. వారు ఆయురారోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామని ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన ప్రతీ ఒక్కరు పేర్కొన్నారు.—————–(-ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )