ఘనంగా బొమ్మరాశిపల్లిలో బొడ్రాయి బోనాలు..
ఊరుకొండ, ఆగస్టు 24 (జనం సాక్షి):
ఊరుకొండ మండల పరిధిలోని బొమ్మరాశిపల్లి గ్రామంలో స్థానికులు బొడ్రాయి బోనాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం బొడ్రాయి బోనాలను పురస్కరించుకొని గ్రామంలోని మహిళలందరూ నియమ నిష్ఠలతో బోనాలు తయారు చేసుకుని తలపై ధరించి పుర వీదుల గుండా ఊరేగింపుగా డబ్బులు బ్యాండ్ మేళాల మధ్య అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.