ఘనంగా మదుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 13(జనం సాక్షి)

 

తెలంగాణ తొలి శాసనసభాపతి,ప్రస్తుత ఎంఎల్సీ సిరికొండ మదుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం మదుసూదనాచారి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అభ్యుదయ సంఘం,విశ్వబ్రాహ్మణ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ మ్యూచువల్లీ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంయుక్త ఆద్వర్యంలో హనుమకొండ లోని సంఘ కార్యాలయంలో నాయకుల సమక్షంలో కేకు కట్ చేసి మదుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జాతి ముద్దు బిడ్డ,ప్రజా నాయకుడు మదుసూదనాచారి అని,ఆయన సేవలు సమస్త విశ్వబ్రాహ్మణ జాతికి ఎంతగానో ఉపయోగ పడ్డాయని,నిత్యం ప్రజలతో మమేకమవుతూ సమస్యలను పరిష్కారానికి పరితపింవే వ్యక్తి అని కొనియాడారు. రాబోయె కాలంలో మదుసూదనాచారి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు సిద్ధోజు విద్యాసాగర్,వేల్పుల దేవాచారి,శ్రీపాద సుదాకర్ రావు,డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్,మట్టెవాడ బ్రహ్మచారి,రాగి కరుణాకర్,చిలుపూరి శ్రీధర్,పుప్పాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.