ఘనంగా వరలక్ష్మి పూజలు
ఇంటింటా వరలక్ష్మి పూజలు నిర్వహించిన మహిళలు
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 25 ::::::
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం, పూజలు కావడంతో మహిళా మణులు వరలక్ష్మి పూజలను ఘనంగా నిర్వహించారు. ఎంతో శోభాయామనంగా ఈ పూజలు నిర్వహించడం జరిగింది .
సంగారెడ్డి జిల్లా కేంద్రం తో పాటు సదాశివపేట, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, జిన్నారం, గుమ్మడిదల , ఓడిఎఫ్ సంగారెడ్డి , ఇలా జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో , జిల్లా కేంద్రంలో కూడా మహిళలు ఈ వరలక్ష్మి పూజలు నిర్వహించుకున్నారు . శ్రావణమాసంలో వచ్చి ఈ వరలక్ష్మి పూజలను ప్రతి సంవత్సరం చేసుకోవడం ఆనవాయితీ . ఉదయం ఉదయాన్నే మహిళలు నిద్ర లేచి , కలాపి చల్లుకొని, ఇంటి ముందర ముగ్గులు వేసి ఇంట్లో ఈ పూజలను జరుపుకుంటారు .
వరలక్ష్మి పూజ పూజకు శ్రీ లక్ష్మీ అమ్మవారిని చక్కగా అలంకరించి ఘనంగా పూజలు నిర్వహించారు. వరలక్ష్మి ఎప్పుడు తమ ఇంట్లో నివాసం ఉండాలని వారు పూజలు నిర్వహించారు .
అనంతరం సాయంత్రం సమయంలో మహిళలను ఒకరి ఇంటికి ఒకరిని ఒకరిని ఆహ్వానించి వారికి సత్కరించి తమలపాకు అరటిపండు , శనిగలు వాయినాలను అందజేశారు.