ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి కలశం ఊరేగింపు.

ఆకట్టుకున్న ఆర్యవైశ్య మహిళల కోలాటం.
అలరించిన పూణే బ్యాండ్.

నాగర్ కర్నూల్ జిల్లా
ప్రతినిధి,సెప్టెంబర్26(జనంసాక్షి):

దసరా ఉత్సవాలలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆవరణలో సాయి బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న 52వ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను సోమవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ శివాలయం నుండి కలశం ఊరేగింపు నిర్వహించి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలను ప్రారంభించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాచిపెద్ది శివకుమార్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పట్టణ కమిటీ అధ్యక్షులు వాసా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేసి నట్లు తెలిపారు.వాసవి కన్యకా పరమేశ్వరి మాతను తొమ్మిది రోజులపాటు వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కలశం ఊరే గింపు సందర్భంగా పూణే బ్యాండ్ వారు నిర్వహించిన కళా ప్రదర్శనలు భక్తులను అలరించాయి. పట్టణ ఆర్యవైశ్య మహిళలు ప్రదర్శించిన కోలాటం డప్పు వాయిద్యాల మధ్య కలశం ఊరేగింపు కొనసాగింది. మహిళలు వేసిన కోలాటం భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా నిర్వాహ కులు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వ హించేందుకు భక్తులు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.ప్రతినిత్యం ఆలయ ఆవరణలో పూజల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఉదయం సాయంత్రం పూజల అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు రాత్రి సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పా టు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు హాకీం రాజేష్, పాలాది యాదయ్య,రమణ, బాదం రమేష్, అల్లంపల్లి రమేష్,బాదం పరమేష్, రాము, రాజు,చంద్రశేఖర్, రాధాకృష్ణ లతో పాటు వాసవి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి లు కండె సాయిశంకర్,రమణ కుమార్,హకీం కిషోర్, గంధం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.