ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి 15వ ఆవిర్భావ వేడుకలు

జెండా ఆవిష్కరించిన మేడి పోషయ్య
ఆత్మకూర్(ఎం) ఆగస్టు 28 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి పదిహేనవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2007 ఆగస్ట్ 28న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో వికలాంగుల హక్కుల సాధనకై విఎచ్ పీఎస్ ఆవిర్భావం జరిగిందని దశల వారీగా మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు చేసి వికలాంగులకు జీవనం సాగించడానికి ఉపయోగపడేలా పెన్షన్ ను సాధించడం జరిగిందని అన్నారు వికలాంగులకు ఎక్కడ ఆపద వచ్చినా అక్కడ విఎచ్ పీఎస్ అండగా నిలబడుతుందని వికలాంగుల హక్కుల సాధనకై నిరంతరం విఎచ్ పీఎస్ ఉద్యమాలు చేస్తుందని అన్నారు ప్రతి నెలా ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ లోపే పెన్షన్ అందించాలని ప్రతి ఒక్క వికలాంగుడికి అంత్యోదయ కార్డ్ ఇవ్వాలని వికలాంగులకు వికలాంగుల బంధు ఇవ్వాలని బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరడం జరిగింది ఈ ఆవిర్భావ వేడుకల్లో జిల్లా ప్రచార కార్యదర్శి లోడి ధనుంజయ్య గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు మేడి పోషయ్య మాదిగ దండు యాదగిరి ముదిరాజ్ దండు సతీష్ ముదిరాజ్
అంబోజు నర్సయ్య రజక ఏదుల్లా నాగేశ్వర్ రెడ్డి అంబోజు జానకి రజక జమ్ముల నర్సిరెడ్డి సంగి యాదమ్మ యాదవ్ తదితరులు వికలాంగులు పాల్గొన్నారు