ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలు.ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలు.

– కురవి మండలంలో  సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో సంబరాలు
కురవి ఫిబ్రవరి-15/జనంసాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలం వివిధ గ్రామాలలో బుధవారం బంజారా ఆరాధ్య గురువు శ్రీశ్రీశ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.కురవి మండలం రాజోలు శివారు కంచర్లగూడెం  గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద, కంచర్ల గూడెం  తండా శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్, మేరమయ్యాడి జెండాల దగ్గర,నెరడ గ్రామ శివారు బాల్య తండాలో మరియు వివిధ గ్రామాలలో శ్రీ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలయా వేసి, కొబ్బరికాయలు కొట్టి, నంగారా డప్పులు కొట్టి,ఆటపాటలతో భోగ్ బండారో నిర్వహించి మహారాజ్ కి నైవేద్యాలతో అంగరంగ వైభవంగా జయంతి వేడుకలు నిర్వహించారు. బాల్య తండాలో సేవలాల్ సేన డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవి నాయక్. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ యావత్ గిరిజన జాతి సోదర సోదరీమణులకు ముందుగా సేవాలాల్ మహారాజ్ జయంతి  శుభాకాంక్షలుతెలిపారు. బంజారాల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ శాంతి, ఆహింస సత్యము,  ఆచరించిన వారి మార్గాన్ని ప్రతి ఒక్కరూ వారి మార్గంలోని నడవాలని అన్నారు. గోబ్రియ సాదు మాట్లాడుతూ  మహారాజ్ కారణజన్ముడని జాతిని ఏకం చేయాలని  గొప్ప సంకల్పంతో కృషి చేసిన మహనీయుడాన్ని కొనియాడారు. అదేవిధంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో క్షేమంగా, పాడిపంటలతో  పచ్చగా ఉండాలని సేవాలాల్ మహారాజ్ ని  ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గోబ్రియా సాదు,బాసు సాదు, ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు