ఘనంగా సర్దార్ భగత్ సింగ్ జయంతి ఉత్సవాలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ పార్టీ కార్యాలయం రామకృష్ణ పూర్ లో సర్దార్ భగత్ సింగ్ 115వ, జయంతి ఉత్సవాలు అఖిల భారత యువ జన సమాఖ్య ఏఐవైఎఫ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ పోటో కు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతర సీపీఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్ట పెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నాడు బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా భారత దేశానికి స్వాతంత్ర్యం కావాలని పోరాడిన విప్లవ యువ కిషోరం భగత్ సింగ్ నాడు బ్రిటీష్ పార్లమెంట్ భవనం మీద తన అనుచరుల తో బాంబు దాడి చేశారని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకుల మీద అనేక కార్యక్రమాలు చేసి బాంబు దాడిలో ఉరి శిక్ష విధించిన బ్రిటీష్ ప్రభుత్వం, తర్వాత బ్రిటీష్ ప్రభుత్వాన్ని క్షమా బిక్ష కోరితే శిక్ష రద్దు చేస్తామంటే నా దేశం కోసం ప్రాణాలు ఇస్తాను తప్ప బ్రిటీష్ వారిని క్షమాపన అడుగను అని, చివరకు ఉరికొయ్యల మీద ప్రాణాలు విడిచాడన్నారు. తాను మరణించే ముందు వరకు కూడా ఇంక్విలాబ్ జిందాబాద్, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని నినాదం ఇచ్చిన యువ నాయకుడు భగత్ సింగ్ అని అన్నారు. తన ఆశయ సాధనకు విద్యార్థి యువజనులు కృషి చేయాలని కోరారు. ఆయన పోరాటం పలితంగానే ఓటు హక్కు వచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, మిట్ట పెల్లి పౌలు, పెండ్యాల కమలమ్మ, కాదండీ సాంబయ్య, మెరుగు రాజేశం, సీపీఐ నాయకులు ఎగుడ మొండి, రామ్పెళ్ళి రాజం ఏ వై ఐ ఎఫ్ నాయకులు ఈరవెని రవీందర్, చొప్పదండి దుర్గ, మోతె రాయలింగు, మిట్ట పెల్లి క్లిస్టాఫర్, బోయపోతుల కొమురయ్య, గోవిందుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.