ఘనంగా హోలీ వేడుకలు
హుజూర్ నగర్ మార్చి 7 (జనంసాక్షి): రంగుల కేళీ ఆనందాల హోలీ పర్వదిన సందర్భంగా మంగళవారం హుజూర్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తో కలిసి హోలీ వేడుకలను ఘనంగా హుజూర్ నగర్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహించుకున్నారు. హోలీ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని అనుభంద సంఘాలు అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువజన, కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, వార్డు అధ్యక్షులు, నాయకులు, పార్టీ మహిళ పట్టణ, వార్డు ప్రతినిధులు, మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.