ఘనంగా 184 వ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
జనం సాక్షి,చెన్నరావు పేట
మండల కేంద్రంలో చెన్నారావుపేట మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 184వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాల అలంకరించి, జెండా అవతరణ అనంతరం కేక్ కటింగ్ చేసుకొని వేడుకలను నిర్వహించడం జరిగింది. మండల కేంద్రంలో జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమంలో మండల బాధ్యుడు దొంతి సతీష్ గౌడ్ పతాక ఆవిష్కరణ చేసి, అనంతరం మాట్లాడుతూ ఫోటోగ్రఫీ వృత్తిలో భాగంగా ఫోటోగ్రాఫర్లందరూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, డిజిటల్ యుగంలో ఫోటోగ్రఫీ రంగం అతలాకుతుల మవుతుందని ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు గుర్తింపునిచ్చి ఫోటోగ్రఫీ కి సంబంధించిన కెమెరాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. ప్రస్తుత ప్రపంచం డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న తరుణంలో అందరూ ఆధునిక రంగంలో నిష్ణాతులు కావాలని, మెళకువలు నేర్చుకోవాలని అన్నారు. రోజురోజుకీ డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న తరుణంలో సాంప్రదాయక ఫోటోగ్రాఫర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని,కరోనా కారణంగా ఆర్థికంగా వెనుకబడిన ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం చేయూతని అందించాలని కోరారు. మండల కమిటీ సభ్యులందరూ ప్రతి సంవత్సరం సీనియర్ ఫోటోగ్రాఫర్ లను సత్కరించే సాంప్రదాయంలో భాగంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ దొంతి సతీష్ గౌడ్ కి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట డివిజన్ బాధ్యులు దొంతి సంతోష్ గౌడ్, మండ కార్తీక్, మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ బాధ్యులు పుట్టరాజు, మంద రమేష్, రామగిరి లక్ష్మణ్, ఇస్లావత్ గోపి, పోలురాజు, భాష బోయిన మహేష్, చిర్ర చంద్రశేఖర్, తడుక రాజు గౌడ్, అనుమండ్ల రమేష్, గుడివాడ రాజు, జన్ను దేవేందర్, అన్న రాజు, మరుపాల అశోక్, పులి ప్రణయ్, ప్రశాంత్,అమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు.