ఘనంగా 62వ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రధానోత్సవాలు

1
దిల్లీ మే 3 (జనంసాక్షి):

62వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కన్నులపండువగా జరిగింది.రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అవార్డు గ్రహీతలను అభినందించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. రానున్న సంవత్సరాల్లో భారత చలనచిత్ర సృజనాత్మకత మరింతగా వ్యాపించాలని ఆకాంక్షించారు. అంతకుముందు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ భారతీయ చలనచిత్ర రంగ అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ , భాజపా అగ్రనేత అడ్వాణీ… తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాసాహెబ్‌ఫాల్కె అవార్డుతోపాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ జాతీయ నటుడు, ఉత్తమ జాతీయ నటి తదితర పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.